Hanumakonda | హనుమకొండలో అమానవీయ ఘటన: వివస్త్ర చేసి మహిళపై చిత్రహింసలు
మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు
హనుమకొండ జిల్లా తాటికాయ గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
Hanumakonda | హనుమకొండ జిల్లాలో అత్యంత ఘోరమైన అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను వివస్త్రను చేసి చిత్రవధ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ధర్మసాగర్ మండలం తాటికాయల(Thatikayala) గ్రామంలో ఈ ఘటన జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ మహిళను ఇనుప గ్రిల్స్ కట్టి, వివస్త్రను చేసి జననాంగాలపై జీడి పోసి చిత్రహింసలకు గురిచేశారు. తప్పు చేశానని క్షమించమని వేడుకున్నా వినకుండా దాడికి పాల్పడ్డారు. కాగా ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు విచారణ చేపట్టారు.
గ్రామానికి చెందిన యువతితో మునుగు మండలం బోలోలుపల్లికి చెందిన రాజుకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. అయితే ఇటీవల కాలంలో రాజు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 10 రోజుల క్రితం ఇద్దరూ కలిసి గ్...



