Sarkar Live

Day: July 3, 2025

Anganwadi | అంగన్వాడీ హెల్పర్లకు శుభవార్త
Hyderabad, State

Anganwadi | అంగన్వాడీ హెల్పర్లకు శుభవార్త

ప్రమోషన్ గరిష్ట వయోపరిమితిని 45 నుంచి 50 ఏళ్లకు పెంపు అంగన్వాడీ హెల్పర్ల (Anganwadi Helpers) కు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి (Promotion) పొందే గరిష్ట వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఫైల్ పై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) గురువారం సంతకం చేశారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గల సుమారు 4322 మంది అంగన్వాడీ హెల్పర్లకు టీచర్లుగా పదోన్నతి పొందే అవకాశం ఏర్పడుతుంది. గతంలో 45 ఏళ్లు దాటిన తర్వాత ప్రమోషన్ కోసం అవకాశాలు లేకపోయినా, ఇప్పుడు వారికీ మళ్లీ చాన్స్ లభించనుంది. Anganwadi హెల్పర్స్ యూనియన్స్ వినతి మేరకు.. గరిష్ట వయో పరిమితిని పెంచాలని అంగన్వాడీ హెల్పర్ యూనియన్ల విజ్ఞప్తి మేరకు సాధ్యసాధ్య...
Harihara Veeramallu Trailer ట్రైలర్ రిలీజ్: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు Goosebumps!
Cinema

Harihara Veeramallu Trailer ట్రైలర్ రిలీజ్: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు Goosebumps!

Harihara Veeramallu Trailer release | ఇటు సినిమాలు, అటు రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ (Pawan Kalyan) క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇది అభిమానులకు సంతోషానిచ్చినా.. ఆయను తెరపై చూడలేమని మ‌ద‌న‌ప‌డుతున్నారు. ఈ క్రమంలో ఆయ‌న ఇదివ‌ర‌కే కమిటైన సినిమాలను ఒక్కొక్కోటిగా పూర్తి చేస్తూ వ‌స్తున్నారు. ఇందులో భాగంగా హరిహర వీరమల్లు షూటింగ్‌ను ఎంత బిజీగా ఉన్నా శ్ర‌మించి ఎట్ట‌కేల‌కు పూర్తి చేశారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను ఈ రోజే రిలీజ్ చేసింది.. ట్రైలర్ ఎలా ఉంది? పవన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అభిమానులను అలరించిందా? లేదా అన్నది ఇపుడు ప‌రిశీలిద్దాం.. హరిహర వీరమల్లు మూవీ (Harihara Veeramallu Movie )ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం (AM Rathnam) రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో పూర్తిచేశారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా అ...
Konda Murali | కొండా మురళి మరోసారి ప్రకంపనలు: మీనాక్షికి లేఖ, మీడియాకు స్పష్టీకరణ
warangal, State

Konda Murali | కొండా మురళి మరోసారి ప్రకంపనలు: మీనాక్షికి లేఖ, మీడియాకు స్పష్టీకరణ

వివాదాల నడుమ కీలక పరిణామం 16 పేజీల నివేదికతో మీనాక్షి నటరాజన్‌ను కలుసిన సురేఖ Warangal News | కొండా మురళి.. సొంత పార్టీ నేతలనే టార్గెట్ గా చేసిన విమర్శలు కొన్నాళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. స్టేషన్ ఘన్ పూర్ కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలను పరోక్షంగా ఆయ‌న‌ విమర్శించారు. దీంతో ఆయా నేతలు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలోనే గురువారం తన సతీమణి, మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) తో కలిసి కొండా ముర‌ళి హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ (Meenakshi Natarajan) తో భేటీ అయ్యారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. అలాగే మీనాక్షి నటరాజన్ కి 16 పేజీల లేఖ అంద‌జేశారు. Kond...
Sangareddy | రోడ్డుప్రమాదంలో డ్యూటీ నుంచి తిరిగి వస్తున్న ఎస్సై మృతి
Crime, Sangareddy

Sangareddy | రోడ్డుప్రమాదంలో డ్యూటీ నుంచి తిరిగి వస్తున్న ఎస్సై మృతి

Sangareddy News : సంగారెడ్డి జిల్లా కంది మండలం చెరియాల్ (Cheriyal) వద్ద NH-65 పై వేగంగా వస్తున్న లారీ ఒక సబ్-ఇన్‌స్పెక్టర్ కారును ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఎస్సై ప్రాణాలు కోల్పోడారు. వివ‌రాల్లోకి వెళితే.. సంగారెడ్డి పట్టణం (Sangareddy City) లోని చాణిక్యపురి కాలనీలో ఉంటున్న రాజేశ్వర్ (59) ఫిల్మ్ నగర్ (Film nagar) పోలీస్ స్టేషన్‌లో SIగా పనిచేస్తున్నారు. బల్కంపేట బోనాలు ఉత్సవాల్లో విధుల‌ను ఆయ‌న‌కు అప్ప‌గించారు. దీంతో రాజేశ్వర్ తన విధుల‌ను పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి బ‌య‌లుదేరాడు. ఈక్ర‌మంలో చేరియాల్ వ‌ద్ద జ‌రిగిన ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు అత‌డిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో త‌ర‌లించ‌గా అక్క‌డ‌ చికిత్స పొందుతూ గంట తర్వాత మరణించారు. రాజేశ్వర్ వారం క్రితం ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో చేరారని, ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుస్తోంది . రాజేశ్వర్ 1990లో ...
జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. Parliament Session-2025
National

జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. Parliament Session-2025

Parliament Monsoon Session-2025 | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 21, 2025 వరకు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 15న జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సన్నాహాలు, భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆగస్టు 13, 14 తేదీల్లో సమావేశాలు ఉండవని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ సెష‌న్‌ను లోక్‌సభ. రాజ్యసభ రెండింటినీ ఏర్పాటు చేయడానికి భారత రాష్ట్రపతి ఆమోదం తెలిపారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. "జూలై 21 నుండి ఆగస్టు 21, 2025 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను భారత రాష్ట్రపతి ఆమోదించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల దృష్ట్యా, ఆగస్టు 13, 14 తేదీలలో సమావేశాలు ఉండవు" అని ఆయన Xలో పోస్ట్ చేశారు. ఆప‌రేష‌న్‌ సిందూర్‌పై వాడీవేడిగా చర్చ‌ల‌కు అవ‌కాశం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జర...
error: Content is protected !!