ACB Raids | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్
                    మంచిర్యాల జిల్లాలో ఏసీబీ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు కోటిపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు దాడులు నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓ రైతు వద్ద నుంచి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహసీల్దార్ ఆకిరెడ్డి నవీన్ కుమార్ ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. 
ఇదిలా ఉండగా ఇటీవల ఏసీబీ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. .. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) 2025 జూన్ లో 31 కేసులు నమోదు చేసి, విచారణ చేపట్టింది. వీటిలో 15 ట్రాప్ కేసులు, రెండు ఆదాయానికి మించిన ఆస్తులు (DA) కేసులు, మూడు నేరపూరిత దుష్ప్రవర్తన కేసులు, నాలుగు సాధారణ విచారణలు, ఏడు ఆకస్మిక తనిఖీలు ఉన్నాయని ఏసీబీ వెల్లడించింది. ఈమేరకు జనవరి నుంచి జూన్ వరకు తన అర్ధ వార్షిక రౌండ్ అప్‌లో ప్రకటించింది.
ACB కి ఇలా ఫిర్యాదు చేయవచ్చు..
వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్...                
                
             
								

