Sarkar Live

Day: July 5, 2025

Venkatesh | వెంకటేష్ మూవీకి టైటిల్ ఇదేనా?
Cinema

Venkatesh | వెంకటేష్ మూవీకి టైటిల్ ఇదేనా?

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ (victory Venkatesh, Trivikram)కాంబోలో ఓ మూవీ తెరకెక్కబోతున్నట్టు తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం(sankrathiki vasthunnam)బ్లాక్ బస్టర్ హిట్టు తర్వాత వెంకీ చేయబోతున్న మూవీ కావడంతో ఆడియన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. 300 కోట్లు కొల్లగొట్టి సీనియర్ హీరోల్లో ఓ రికార్డును క్రియేట్ చేశారు. వెంకీ మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు. కామెడీ లో వెంకీ సత్తా ఏంటో మరోసారి సంక్రాంతికి వస్తున్నాం మూవీ చూపించింది అని చెప్పొచ్చు. తర్వాత వెంకీ ఏ జానర్ లో మూవీ చేస్తారో అని అందరూ వెయిట్ చేశారు. మళ్ళీ కామెడీ ఎంటర్టైనర్ తో నే ఆడియన్స్ ముందుకు రావాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉన్న మూవీ నే చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలాంటి మూవీస్ తీయడంలో త్రివిక్రమ్ దిట్ట. వీరిద్దరి కాంబోలో ఆ జానర్ లో మూవీ వచ్చిందంటే బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే. Venkatesh : ఫ్యామిలీ ఆడ...
ప్రభాస్-అమరన్ డైరెక్టర్ కాంబినేషన్ ఫిక్స్..? త్వరలో భారీ సినిమా అనౌన్స్‌మెంట్..! Prabhas Next movie
Cinema

ప్రభాస్-అమరన్ డైరెక్టర్ కాంబినేషన్ ఫిక్స్..? త్వరలో భారీ సినిమా అనౌన్స్‌మెంట్..! Prabhas Next movie

Prabhas Next Movie | శివకార్తికేయన్ (Siva Karthikeyan) కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా అమరన్ (Amaran)మూవీ నిలిచిపోయింది. సాయి పల్లవి, శివకార్తికేయన్ నటనతో ఆడియన్స్ కంటతడి పెట్టించాడు. ఈ మూవీతో డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి(Rajkumar periya Swami)పేరు మారు మోగిపోయింది. ఆ మూవీని అంత ఎమోషనల్ గా తెరకెక్కించిన విధానానికి బడా స్టార్స్ కూడా ఆయన డైరెక్షన్ లో చేయడానికి ముందుకు వస్తున్నారు. డైరెక్టర్ మాత్రం చాలా సెలెక్టివ్ గా తన నెక్స్ట్ మూవీ ఉండేలా చూసుకుంటున్నాడు. ఇప్పటికే తన నెక్స్ట్ మూవీ సూర్య,రజినీకాంత్ తో చేస్తున్నట్టు టాక్ వినబడ్డా అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఇప్పుడు మరో స్టార్ హీరోతో మూవీ చేయనున్నట్టు ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ డార్లింగ్ హీరో ప్రభాస్(Rebal Star Prabhas )తో మూవీ చేయనున్నట్టు ఫిలిం నగర్ టాక్. ఇప్పటికే డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి ప్రభా...
Free Bus | ఉచిత బ‌స్సు ప‌థ‌కంపై మంత్రి పొన్నం కీల‌క వ్యాఖ్య‌లు
Hyderabad, State

Free Bus | ఉచిత బ‌స్సు ప‌థ‌కంపై మంత్రి పొన్నం కీల‌క వ్యాఖ్య‌లు

Hyderabad | ప్రజాభవన్‌లో శ‌నివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 151 మండల మహిళా సంఘాల బస్సు యజమానులకు రూ.1.05 కోట్ల చెక్కులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ర‌వాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. ఈ సంద‌ర్భంగా మ‌హాల‌క్ష్మి ఉచిత బ‌స్సు ( Free Bus scheme) ప‌థ‌కంపై ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో మహిళా సాధికారతను ముందుకు తీసుకెళ్లే దిశగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన "మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం" విజయవంతమవుతోంద‌న్నారు. అంతకుముందు మహిళా రచయితలు, కవులు రచించిన "మహా లక్ష్మి – మహిళా సాధికారతలో ప్రగతి చక్రాలు" అనే పుస్తకాన్ని నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహిళల ప్రయాణ అనుభవాలను కవిత్వం రూపంలో చదివి వినిపించారు. ఈసంద‌ర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ “ఒక్క చేతి గుర్తు చూపితే చాలు.. బస్సు ముంగిట నిలుస్తుంది.ఇది మహిళలకు సమానత్వం మీద ముందడుగు.” అని అన్నారు. ఇప్పటివరకు ప్రభ...
Road Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం, వ‌రుడితో స‌హా ఎనిమిది మంది దుర్మ‌ర‌ణం
Crime

Road Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం, వ‌రుడితో స‌హా ఎనిమిది మంది దుర్మ‌ర‌ణం

సంభాల్‌ : ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident ) జరిగింది. జెవానై గ్రామంలో పెండ్లి బృందంతో వెళుతున్న బొలెరో వాహనం అదుపు తప్పి ఓ కళాశాల గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు (24) సహా ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన స‌మీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితులందరిని ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జెవానై కమ్యూనిటీ ఆరోగ్య‌కేంద్రానికి తరలించారు. ప్రధాని మోదీ సంతాపం కాగా, సంభాల్‌ (Sambhal)లో వరుడితో పాటు ఎనిమిది మంది మరణించిన ప్రమాదం (Road Accident)పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరమని ఎక్స్ (x) లో పేర్కొన్నారు. మృతుల కు...
error: Content is protected !!