Sarkar Live

Day: July 6, 2025

Heavy Rains | అల‌ర్ట్‌.. తెలంగాణలో ఐదు రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వ‌ర్షాలు
State

Heavy Rains | అల‌ర్ట్‌.. తెలంగాణలో ఐదు రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వ‌ర్షాలు

Rain Alert | తెలంగాణలో రానున్న‌ ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains ) కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఈ మేరకు ప‌లు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. సోమవారం భూపాలపల్లి, ములుగు, నిజామాబాద్ ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది. మంగళవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవ‌కాశ ఉన్న‌ట్లు తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇక నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయ‌ని వెల్ల‌డించింది. తెలంగాణ‌లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. బుధవారం భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌...
పేదలకు గుడ్ న్యూస్.. ఈనెలలోనే 2.4 లక్షల కొత్త రేషన్‌కార్డులు.. మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన  – Ration Cards
State, Hyderabad

పేదలకు గుడ్ న్యూస్.. ఈనెలలోనే 2.4 లక్షల కొత్త రేషన్‌కార్డులు.. మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన – Ration Cards

హైదరాబాద్‌: కొత్త రేషన్‌ కార్డుల (Ration Cards) పంపిణీకి తెలంగాణ సర్కారు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌ కార్డు మంజూరు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. అమేరకు అర్హులందరికీ రేషన్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 6 నెలల్లో 41 లక్షల మందికి రేషన్ కార్డులు అందించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తాజాగా, ఈ నెలలో మరో 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వీటితో కలిపి 11.3 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. గడిచిన 6 నెలల్లో 41 లక్షల మందికి కొత్తగా రేషన్‌ అందించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెలలో మరో 2.4 లక్షల కొత్త కార్డులు పంపిణీ చేస్తామని చెప్పారు. వీటి ద్వారా మరో 11.30 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ఆదివారం మ...
Toll charges | ప్రయాణికులకు శుభవార్త:  వంతెనలు, సొరంగాలు, ఎలివేటెడ్ రోడ్లపై కేంద్రం సంచలన నిర్ణయం
National

Toll charges | ప్రయాణికులకు శుభవార్త: వంతెనలు, సొరంగాలు, ఎలివేటెడ్ రోడ్లపై కేంద్రం సంచలన నిర్ణయం

టోల్ ఛార్జీలు (Toll charges) 50% తగ్గింపు New Delhi : జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సొరంగాలు, వంతెనలు, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ హైవేలు వంటి నిర్మాణాలు ఉన్న రహదారి సెక్షన్‌లపై టోల్ ఛార్జీలను 50 శాతం వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న ఈ చర్యతో వాహదారుల ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గిపోనున్నాయి. ఫ్లైఓవర్లు లేదా ఎలివేటెడ్ రోడ్లు, సొరంగాలు, వంతెనలు వంటి నిర్మాణాలు కలిగిన జాతీయ రహదారుల్లో ప్రభుత్వం టోల్ రేట్లను 50 శాతం వరకు తగ్గించింది. జాతీయ రహదారి రుసుము నియమాలు, 2008 ప్రకారం జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద వినియోగదారు రుసుములు వసూలు చేస్తున్నవిషయం తెలిసిందే.. 2008లో అమలులోకి వచ్చిన నేషనల్ హైవే టోల్ నియమాలను సవరించిన మంత్రిత్వ శాఖ, కొత్త లెక్కింపు పద్ధతిని తాజా నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఇందులో పేర్...
error: Content is protected !!