Yadadri | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య.. రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించే యత్నం..
Yadadri Bhuvanagiri News | వివాహేతర సంబంధం ఓ పచ్చని సంసారాన్ని విచ్ఛిన్నం చేసింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా మారాడన్న కోపంతో భార్య ప్రియుడితో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం కట్టుకున్న భర్తను అంతమొందించింది. రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేసినా… చివరికి పోలీసుల విచారణతో కుట్ర బయటపడింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘాతుకం అందరినీ తీవ్రంగా కలిచివేసింది.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District) ఆత్మకూరు మండలం పల్లెర్లకు చెందిన వస్తువుల స్వామి (38) ను మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన స్వాతితో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. స్వామి స్వగ్రామంలోనే ఉంటూ భువనగిరిలో ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. భార్య స్వాతి కూడా ఇదే షో రూంలో పనిచేస్తోంది. ఈ ...



