TGBKS | ఎమ్మెల్సీ కవితకు షాక్..! బొగ్గు గని కార్మిక సంఘం నుంచి ఉద్వాసన.. ?
TGBKS | తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TGBKS) నుంచి MLC కవితకు ఉద్వాసన పలికారు. ఇప్పటివరకు ఆ సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవిత స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించారు. తెలంగాణ భవన్‌లో సమావేశమైన సంఘం నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై TGBKS.. బీఆర్ఎస్‌కు అనుబంధంగా పనిచేయాలని నిర్ణయించారు. కవిత, KTRల మధ్య విభేదాలు పెరుగుతున్న తరుణంలో KTR కొప్పుల ఈశ్వర్‌ను నియమించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతల సమావేశం బుధవారం సాయంత్రం జరిగింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పార్టీకి అనుబంధంగా అనేక కార్యక్రమాలను చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ దిశగా సింగరేణి ప్రాంతంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జీలు, మాజీ మంత్రులతో సమన్వయం చేసుకోవాలని కేటీఆర్ సూచించార...



