Fish Venkat | టాలీవుడ్ లో విషాదం.. హాస్యనటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత
                    Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు, నటి సరోజినీదేవి మృత్యువాత పడిన విషయం మరిచిపోకముందే సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. సినీ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన తెలుగు సినిమాలలో విలన్ గ్యాంగ్‌లో ఎక్కువ కనిపించారు. సీరియస్‌గా కనిపిస్తూనే తన స్టైల్ లో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతూ.. నవ్వించడం ఆయన ప్రత్యేకత. కాగా ఫిష్ వెంకట్ వయ్సు 53 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయడం కోసం కుటుంబ సభ్యులు తీవ్రంగా కృషి చేశారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉండడంతో సినీ పరిశ్రమలో కొందరు ఆర్థిక సాయం అందించారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి చందానగర్‌లోని పీఆర్‌కే హాస్పిటల్‌లో ఆయన కన్నుమూశారు.
ఫిష్ వెంకట్ తన ప్రత్యేకమైన తెలంగాణ...                
                
             
								
