Telangana ACB | రూ.లక్ష లంచం.. ఏసీబీ అధికారులు పట్టుకునేలోపే పారిపోయిన పంచాయతీ కార్యదర్శి
Telangana ACB Raids | రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని ఇన్ములనర్వ గ్రామ పంచాయతీ (Panchayat Secretary) కార్యదర్శి సురేందర్ (Surendar)పై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు కేసు నమోదు చేశారు. ఓ నిర్మాణంపై ఇచ్చిన నోటీసును పట్టించుకోకుండా ఉండేందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.లక్ష డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో రూ.50 వేలు లంచం తీసుకున్నారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే యత్నించగా నిందితుడు సురేందర్ పరారయ్యాడు.
శుక్రవారం సాయంత్రం శంషాబాద్‌లోని ఇండియానా హోటల్ సమీపంలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.50 వేల మొత్తాన్ని సురేందర్ స్వీకరించి తన ఎస్‌యూవీ కారులో సంఘటనా స్థలం నుంచి చందానగర్ లోని తన అపార్ట్మెంట్ వెళ్లాడు. తన కారు తన ఇంటి వద్ద నిలిపి తన బావమరిది కారు తీసుకొని అతనికి లంచం డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే, ఏసీబీ అధికారులు కారును, లంచం తాలుకు నగదు ...

