Sarkar Live

Day: July 29, 2025

KCR | క్షేత్రస్థాయిలో ఉద్యమాలకు సిద్ధం కండి
State, Hyderabad

KCR | క్షేత్రస్థాయిలో ఉద్యమాలకు సిద్ధం కండి

హైదరాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా రేవంత్ ప్రభుత్వంపై (Revanth Govt) క్షేత్రస్థాయిలో పోరాాటాలకు సిద్ధంకావాలని గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) పిలుపునిచ్చారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మంగళవారం (జులై 29) బీఆర్ఎస్ శ్రేణులతో కేసీఆర్ సమావేశమయ్యారు. రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఆంధ్రా ప్రయోజనాలను కాపాడేందుకు స్వయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే పాలనా విధానాలను అమలుచేయడం దుర్మార్గమని అన్నారు. ఇక్కడ చంద్రబాబు..అక్కడ మోదీల ప్రయోజనాలను కాపాడేందుకు సీఎం తహతహ లాడుతున్నాడని, దీనిని తెలంగాణ సమాజం గమనిస్తున్నదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశాపూర్వకంగా పండబెట్టి.. వానాకాలం నాట్లు దగ్గరపడుతున్నా కూడా.. ఇంతవరకు రైతాంగానికి సాగునీరు అందించని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కన్నేపల్లి పంప్ హ...
Daya Nayak : ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌కు ప‌దోన్న‌తి.. ! అసలు ఎవరీ దయానాయక్​?
Crime

Daya Nayak : ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌కు ప‌దోన్న‌తి.. ! అసలు ఎవరీ దయానాయక్​?

మహారాష్ట్రలో దయా నాయక్‌ (Daya Nayak).. ‘ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు’గా అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయనకు ఏసీపీగా పదోన్నతి లభించడంతో మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఆయనతోపాటు మరికొందరు అధికారులు కూడా అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ACP)లుగా ప్రమోషన్‌ పొందారు. 1990ల్లో ముంబయిలో అండర్‌వరల్డ్‌ కార్యకలాపాలు తీవ్రంగా ఉన్న కాలంలో సుమారుగా 80 మంది గ్యాంగ్‌స్టర్లను దయా నాయక్‌ ఎన్‌కౌంటర్‌ చేసినట్లు సమాచారం. ఈ దయానాయక్​ స్ఫూర్తితో గతంలో హిందీతోపాటు పలు భాషల్లో సినిమాలు వచ్చాయి. దయా నాయక్‌ ఎవరు..? కర్ణాటకలోని ఉడిపికి చెందిన దయా నాయక్‌ (Daya Nayak) తన కుటుంబాన్ని పోషించుకోవడానికి 1979లో ముంబైకి వెళ్లి ఓ టీ స్టాల్‌లో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. గోరేగావ్‌లోని మునిసిపల్ పాఠశాల నుండి 12వ తరగతి పూర్తి చేసి, తరువాత అంధేరిలోని CES కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత 1995లో ముంబయిలో ఎస్సై ఉద్యోగం ...
Lok Sabha Debate | పాకిస్థాన్ వేడుకోవడంతోనే కాల్పుల విరమణ..!
National

Lok Sabha Debate | పాకిస్థాన్ వేడుకోవడంతోనే కాల్పుల విరమణ..!

‘ఆపరేషన్ సిందూర్‌’పై లోక్‌సభలో ఈ రోజు వాడీవేడీగా చ‌ర్చ‌లు (Lok Sabha Debate) సాగాయి. విప‌క్ష నేత‌లు సంధించిన ప్రశ్నలకు ప్ర‌ధాని మోదీ బృందం దీటుగా స‌మాధాన‌మిచ్చింది. మంగళవారం జరిగిన చర్చలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సహా హోం మత్రి అమిత్ షా, ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ప్రతిపక్షాల వాద‌న‌ల‌ను కొట్టిపారేశారు. పార్ల‌మెంట్ వేదిక‌గా కాల్పుల విరమణలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమేయం లేదని మోదీ తేల్చి చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం పాకిస్థాన్‌కు వణుకు పుట్టించిందని తెలిపారు.’ దయచేసి దాడులు ఆపండి’ అని పాక్ డీజీఎంఓ మన డీజీఎంఓను వేడుకోవడంతోనే కాల్పుల విరమణకు అంగీకరించామని సభకు మోదీ వివరించారు. భారత్, పాకిస్థాన్ కాల్పుల‌ విరమణలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత్ర లేదని ప్రధాని ధైర్యంగా చెప్పాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సవాల్ విసిరా...
HYDRAA : మూసీ నది ఆక్రమణలపై కొరడా – షెడ్లు, షాపుల తొలగింపు
State, Hyderabad

HYDRAA : మూసీ నది ఆక్రమణలపై కొరడా – షెడ్లు, షాపుల తొలగింపు

మూసపేటలో ఆక్రమణల నుంచి పార్కుకు విముక్తి పార్కు స్థలంలో కబ్జాలు తొలగించిన హైడ్రా హైదరాబాద్ (Hyderabad) లోని మూసీ నది (Musi River)లో ఆక్రమణలను హైడ్రా (HYDRAA) తొలగించింది. మూసీ పరీవాహక ప్రాంతంలోని చాదర్ ఘాట్ బ్రిడ్జి నుంచి ఉస్మానియా హాస్పిటల్ వరకు పలు అక్రమ నిర్మాణాలను మంగళవారం హైడ్రా నేలమట్టం చేసింది. ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్ల నుంచి మూసీని ఆక్రమించి, పలు నిర్మాణాలు చేపట్టారు. వాటిని ప్రయివేట్ బస్సులకు, లారీలకు కిరాయికి ఇస్తున్నారు. అంతేకాకుండా రాత్రి వేళల్లో ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్నట్టు స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో మూసీ ప్రాంతంలో విచారణ చేపట్టిన అధికారులు, ఆక్రమణలు నిజమేనని నిర్ధారించారు.మంగళవారం ఉదయం నుంచి పోలీసు భారీ బందోబస్తు మధ్య మూసీలో తిష్టవేసిన షెడ్డులను తొలగించారు. ఇలా ఉండగా న‌గ‌రంలోని మూసాపేట ఆంజ‌నేయ న‌గ‌ర్‌లో అక్...
రావితేజ కొత్త మల్టీప్లెక్స్ ‘ART Cinemas’ జూలై 31న గ్రాండ్ ఓపెనింగ్
Cinema

రావితేజ కొత్త మల్టీప్లెక్స్ ‘ART Cinemas’ జూలై 31న గ్రాండ్ ఓపెనింగ్

టాలీవుడ్ హీరో, మాస్ మహారాజా రవితేజ థియేటర్ బిజినెస్‌ను ప్రారంభించారు. ఏషియన్ సినిమాస్‌తో కలిసి హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఆరు స్క్రీన్లతో అత్యాధునిక హంగుల‌తో లగ్జరీ మల్టీఫ్లెక్స్ ' ART Cinemas ' థియేటర్‌ను నిర్మించారు. జూలై 31న దీని ప్రారంభోత్సవం జరగనుండగా, తొలి సినిమాగా విజ‌య్ దేవ‌ర‌కొండ కింగ్‌డమ్ మూవీని ప్రదర్శించనున్నారు. 60 అడుగుల భారీ స్క్రీన్‌, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో ఈ మల్టీఫ్లెక్స్‌ ఈస్ట్ హైదరాబాద్‌లో అత్యుత్తమ సినిమాటిక్ అనుభవం అందించనుంద‌ని ప‌లువురు పేర్కొన్నారు. ఈ అత్యాధునిక మల్టీప్లెక్స్ జూలై 31, 2025న ప్రారంభం కానుంది, ఆరు స్క్రీన్లతో ఉన్న ఈ థియేట‌ర్ ఈస్ట్‌ హైదరాబాద్ వాసుల‌కు సినిమాటిక్ అప్‌గ్రేడ్‌ను అందిస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ యాక్షన్ డ్రామా, కింగ్‌డమ్ మొద‌టిసినిమాగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. ART Cinemas : అత్యాధునిక సాంకేతికత QUBE అభివృద్ధి చేసిన ప్రీమియం లార...
error: Content is protected !!