71th National Film Awards : జాతీయ చలన చిత్ర అవార్డులు.. .. విక్రాంత్ మాస్సే, షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీలకు పురస్కారాలు
                    71th National Film Awards  |  71వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2023 విజేతలను ఈరోజు, ఆగస్టు 1న న్యూఢిల్లీలో ప్రకటించారు. జాతీయ ఉత్తమ చిత్రంగా విక్రాంత్ మస్సే నటించిన ‘12th ఫెయిల్’కు అవార్డు వరించింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు పంచుకున్నారు. షారుక్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మస్సే (12th ఫెయిల్)లు ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా ‘మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ (హిందీ)లో నటనకు రాణీ ముఖర్జీని అవార్డు వరించింది.'
2023లో, షారుఖ్ ఖాన్ తన పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో భారతదేశంలో 70 మిలియన్లకు పైగా ప్రేక్షకులను ఆకర్షించడం ద్వారా చరిత్ర సృష్టించాడు. ఈ మూడు ప్రాజెక్టులు భారతదేశంలో రూ. 1300 కోట్లకు పైగా వసూలు చేశాయి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 2500 కోట్లు వసూలు చేశాయి.
12th ఫెయిల్ చిత్రానికి ఉత్తమ నటుడిగా విక్రాంత్ మాస్సే అవార్డు గెలుచుకున్నారు. 12th ఫెయిల్ చిత్రంలో తన శక్తివంతమైన నటనకు గాను వ...                
                
             
								


