Uttarkashi | వరద బీభత్సం.. – ఐదుగురు మృతి.. 10 మంది జవాన్లు గల్లంతు..?
                    Uttarkashi Floods | ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని ఉత్తరకాశీలో వరదలు బీభత్సం సృష్టించాయి. ధరాలీ గ్రామంపై ఒక్కసారిగా వరద నీరు పోటెత్తడంతో ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. 10 మంది జవాన్లు వరదల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 50 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని, 20-25 హోటళ్లు, నివాసాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయని స్థానికులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఎస్‌డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుంది. సహాయక చర్యల కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం భారత సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ బృందాలు ఘటనా స్థలానికి బయల్దేరి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటన (Uttarkashi Tragedy)పై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల విషయంలో సీనియర్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జ...                
                
             
								


