Detect heart failure | ఇక క్షణాల్లో గుండె వైఫల్యాన్ని పసిగట్టొచ్చు..
                    Detect heart failure : గుండె వైఫల్యం (Heart Failure)ను క్షణాల్లోనే ముందుగా పసిగట్టే పరికరం భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ దేశంలోనే మొట్టమొదటి అద్భుతమైన వైద్య ఆవిష్కరణగా నిలిచింది. దీనిని నారాయణ హెల్త్ (Narayana Health) క్లినికల్ రిసెర్చ్ టీం, మేధా ఏఐ (Medha AI) అనే అడ్వాన్స్ ఎనలైటిక్స్ అండ్ ఏఐ (Advanced Analytics & AI) విభాగం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ECG చిత్రాల ఆధారంగా గుండె పనితీరును ముందే అంచనా వేసేలా దీన్ని రూపొందించారు.
Detect heart failure : గ్రామీణ ప్రాంతాలకు పెద్ద వరం
ఇది వనరులు తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఉపయోగపడే ఆవిష్కరణ. మారుమూల ప్రాంతాల్లో చాలామంది రోగులకు గుండె సమస్యలు ఉన్నా అవసరమైన పరీక్షలు తీసుకునే అవకాశం ఉండదు. ముఖ్యంగా "ఇకో" (Echocardiography), గుండె పనితీరును అంచనా వేయడంలో ప్రాముఖ్యత గల పరీక్ష...                
                
             
								


