Hyderabad Rains | మూసీ నది పునరుద్ధరణపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో వరదల నివారణకు ‘మూసీ పునరుజ్జీవనమే’ మంత్రం
హైదరాబాద్‌లో వర్షాల ప్రభావం తగ్గించేందుకు సీఎం ప్రత్యేక ప్రణాళిక
మూసీకి అనుసంధానం – చెరువులు, కుంటలు, నాలాల కలయికతో నగర భద్రత
Hyderabad Rains | హైదరాబాద్ మహా నగరంలో భారీ వర్షాలు కురిసినా తట్టుకునేలా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Ravanth Reddy) ఆదేశించారు. వరద నీటి ప్రవాహనికి ఉన్న అడ్డంకులను అధిగమించాలని ఆదేశించారు. వర్షాలతో నగరం అతలాకుతలం కాకుండా ఉండేందుకు అత్యవసరంగానే శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. తాగునీరు, వరద నీరు, డ్రైనేజీలు, ట్రాఫిక్ వ్యవస్థలను మరో వందేళ్ల భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకొని కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఢిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి నిన్న రాత్ర...


