Rain Alert | మరో మూడు రోజులు భారీ వర్షాలు
                    IMD Rain Alert to Telangana and AP : బంగాళాఖాతంలోని రుతుపవన ద్రోణి, కోస్తాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతోంది. మరోవైపు వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 13న (బుధవారం) అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక విషయాలను వెల్లడించింది. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిందాఇ. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
బంగాళాఖాతంలోని రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని 13 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, ములుగు, మ...                
                
             
								
