Hanmakonda | మంత్రి కొండా సురేఖ ఇంటి ఎదుట ధర్నా..
Hanmakonda News : హనుమకొండ రాంనగర్ లోని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha ) ఇంటి వద్ద సీఐటీయూ (CITU) ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని(Mid-day meal ) అక్షయపాత్రకు ఇన్వొద్దని డిమాండ్ చేస్తూ సోమవారం ఇంటిలోకి చొచ్చుకుపోయేందుకు మధ్యాహ్న భోజన కార్మికులు (Mid-Day Meal Workers) యత్నించారు. నెలకు వేతనం ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మధ్యాహ్న భోజనం పథకాన్ని అక్షయపాత్రకు అప్పగించడం చాలా బాధకరమని పేర్కొన్నారు.
ఓట్ల కోసం మధ్యాహ్న భోజన కార్మికులను కాంగ్రెస్ పార్టీ (Congress Party) మోసం చేసిందని ఫైర్ అయ్యారు. తమ సమస్యలను వెల్లబోసుకుందామని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్దకు వెళ్తే.. పోలీసులు అరెస్టు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు. ఎలాంటి జీతాలు లేకున్నా కూడా అప్పులు తెచ్చి మరీ విద్యార్థుల కోసం వండిపెట్టామని, ఇప్పుడు మాకు ఉపాధి లేక...


