కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటుంగా జూనియర్ అసిస్టెంట్ అరెస్ట్ -Bribery case
                    Vikarabad bribery case | వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ దాడులు సంచలనం సృష్టించాయి. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సుజాత అనే మహిళా ఉద్యోగిని రూ.15,000 లంచం (Bribery ) తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏసీబీ తనిఖీల అనంతరం ఉమ్మడి రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మీడియాతో వివరాలు వెల్లడించారు. నవాబ్ పేట మండలం, వట్టిమినపల్లి గ్రామానికి చెందిన ఓ రైతుకు రెండెకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమి ఉంది. ఆ భూమిని పట్టా భూమి అంటూ ఓ రియాల్టర్ కబ్జా చేసేందుకు యత్నించాడు. దీంతో బాధితుడు నవాబుపేట తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా, కలెక్టర్ కార్యాలయం నుంచి ఆర్డర్ కాపీ తీసుకురావాలని తహసీల్దార్ తెలిపారు. దీంతో ఆర్డర్ కాపీ కోసం కలెక్టర్ కార్యాలయంలో బాధితుడు దరఖాస్తు సమర్పించాడు. కలెక్టర్ కార్యాలయం రెవెన్యూ శాఖ పరిధిలోని ఈ సెక్షన్ లో పనిచేస్తు...                
                
             
								



