Sarkar Live

Day: August 14, 2025

Beer bottle : బీరు సీసాలో సోంపు ప్యాకెట్ కలకలం – వరంగల్‌లో  ఘటన
Viral, warangal

Beer bottle : బీరు సీసాలో సోంపు ప్యాకెట్ కలకలం – వరంగల్‌లో ఘటన

Warangal News | వ‌రంగ‌ల్ జిల్లాలో బీరు ప్రియులు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యే ఘ‌ట‌న చోటు చేసుకుంది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని ఓ వైన్‌ షాపులో కొనుగోలు చేసిన కింగ్‌ ఫిషర్‌ బీరు సీసాలో సోంపు ప్యాకెట్‌ బయటపడింది. ఇల్లంద గ్రామంలో ఓ వ్య‌క్తి కింగ్ ఫిషర్ బీరు (Kingfisher Beer bottle ) కొనుగోలు చేశాడు. తాగడానికి ముందు బీరు సీసాను నిశితంగా ప‌రిశీలించి చూడగా, అందులో సోంపు ప్యాకెట్ క‌నిపించడంతో అవాక్కయ్యాడు. వెంటనే స‌ద‌రు వ్య‌క్తి వైన్ షాపు య‌జ‌మానుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నాణ్య‌త‌తో కూడిన బీర్ల‌ను విక్ర‌యించాల‌ని హెచ్చ‌రించాడు. ఇలా చెత్తాచెదారం ఉన్న బీర్ల‌ను అమ్మ‌డం ఏమాత్రం స‌రైంది కాద‌ని మండిప‌డ్డాడు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీక...
Bhupalpally |  విద్యార్థులకు క‌రెంట్ షాక్‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌
warangal

Bhupalpally | విద్యార్థులకు క‌రెంట్ షాక్‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

Jayashankar Bhupalpally News : స్వాతంత్య్ర వేడుక‌ల (Independence Day celebrations) ఏర్ప‌ట్ల‌లో ఉన్న విద్యార్థులు విద్యాదాఘాతానికి (Electric Shock) గుర‌య్యారు. జాతీయ జెండాను సిద్ధం చేస్తున్న క్ర‌మంలో ప్ర‌మాదానికి గుర‌య్యారు. ముగ్గురు విద్యార్థుల‌తోపాటు ఒక స్కావెంజ‌ర్ స్వ‌ల్పంగా గాయ‌ప‌డ‌గా వీరిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా (Jayashankar Bhupalpally district) మ‌హ‌దేవ‌పూర్ (Mahadevpur mandal) మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఈ సంఘ‌ట‌న ఇవాళ చోటుచేసుకుంది. జాతీయ జెండాను క‌ట్టే ఇనుప పోల్‌(iron pole)ను పాఠ‌శాల భ‌వ‌నం పైనుంచి దింపుతున్న క్ర‌మంలో విద్యుత్ తీగ‌లు తాకి ముగ్గురు విద్యార్థులతోపాటు స్కావెంజ‌ర్ షాక్‌ (Electric Shock) కు గుర‌య్యారు. స్వ‌ల్పంగా గాయ‌ప‌డిన (minor injuries) వీరిని మ‌హాదేవ‌పూర్ సామాజిక ఆస్ప‌త్రి (Hospital)కి త‌ర‌లించారు. విద్యుదా...
IIT Hyderabad | హైదరాబాద్‌లో డ్రైవర్ లేకుండానే న‌డిచే బస్సు.. ఎలా పనిచేస్తుందంటే..
Technology

IIT Hyderabad | హైదరాబాద్‌లో డ్రైవర్ లేకుండానే న‌డిచే బస్సు.. ఎలా పనిచేస్తుందంటే..

IIT-H రూపొందించిన డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ బస్సు AI ఆధారిత కొత్త రవాణా విప్లవం భారతదేశ రవాణా సాంకేతికతలో మరో ముఖ్యమైన ముందడుగు పడింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్ (IIT Hyderabad) స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ చేసింది. పూర్తిగా ఆటోనమస్ డ్రైవ‌ర్ లెస్ ( driverless bus) ఎలక్ట్రిక్ బస్సును ప్రారంభించింది. కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI), ఆధునిక రోబోటిక్స్ విధానాల‌తో ఇది ప‌నిచేస్తోంది. ఎలా ప‌నిచేస్తుంది? ఈ డ్రైవర్‌లెస్ బస్సును హైదరాబాద్‌లోని ఒక స్టార్ట్‌అప్‌తో IIT-H అభివృద్ధి చేసింది. బస్సులో అత్యాధునిక సెన్సర్లు, హై-డెఫినిషన్ కెమెరాలు, లిడార్ (LiDAR) టెక్నాలజీ, AI ఆధారిత నావిగేషన్ సిస్టమ్స్‌ను అమ‌ర్చారు. ఈ బ‌స్సు న‌డిచేట‌ప్పుడు రోడ్డుపై అడ్డంకులను గుర్తిస్తుంది. ముందున్న మార్గాన్ని క‌చ్చితంగా గుర్తించి నావిగేట్ చేయడం, ట్రాఫిక్, వాతావరణ పరిస్థితులు మారినా త...
BRS vs Congress | నీటి ప్రాజెక్టుల భద్రతపై కాంగ్రెస్ నిర్లక్ష్యం  స‌ర్కార్‌పై కేటీఆర్ ఫైర్‌
State, Hyderabad

BRS vs Congress | నీటి ప్రాజెక్టుల భద్రతపై కాంగ్రెస్ నిర్లక్ష్యం స‌ర్కార్‌పై కేటీఆర్ ఫైర్‌

BRS vs Congress : భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వ‌కుంట్ల‌ రామారావు (KTR) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress govt)పై ఫైర్ అయ్యారు. తెలంగాణలోని ముఖ్యమైన నీటి పారుదల ప్రాజెక్టుల భద్రత పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమ‌ర్శించారు. ముఖ్యంగా జూరాల, మంజీరా, సింగూర్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్ర‌మాద‌ హెచ్చరికలు (danger warnings) వెలువడినా వాటిని పట్టించుకోవడంలేదని మండిప‌డ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మాత్రమే రాజకీయం కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project)లోని మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్ల‌ర్లు దెబ్బతిన్నాయనే కారణంగా కాంగ్రెస్, బీజేపీలు నిరంతరం విమర్శలు చేస్తున్నాయని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. అదే సమయంలో ఇతర ప్రాజెక్టులలో కూడా మరమ్మతులు అవసరమయ్యే పరిస్థితి ఉన్నా వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. “ప్రతి ప్రాజెక్ట్‌కూ కాలానుగుణంగా మరమ్మతులు అవసరం అవు...
Heavy Rains | ఆగ‌ని వ‌ర్షాలు.. హెచ్చ‌రిక‌లు జారీ
State

Heavy Rains | ఆగ‌ని వ‌ర్షాలు.. హెచ్చ‌రిక‌లు జారీ

Heavy Rains in Telangana : తెలంగాణలో ఎడ‌తెర‌పిలేకుండా భారీ వ‌ర్షాలు (heavy rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ (southern Telangana)లోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇంకా ఇవి కొన‌సాగొచ్చ‌ని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌తోపాటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట త‌దిత‌ర‌ జిల్లాల్లో ఈ రోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. Heavy Rains : ఎక్క‌డెక్క‌డ అంటే.. ప్రస్తుతం ఉన్న తక్కువ వాయు పీడన (low-pressure) పరిస్థితులు సముద్ర మట్టం నుంచి పైపొరల వరకు చురుగ్గా ఉన్నాయి. దీని కారణంగా వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉంది. వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జన‌గాం, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, పెద్దప...
error: Content is protected !!