Sarkar Live

Day: August 16, 2025

farmer’s protest | యూరియా కొరతపై నిర‌స‌న… గ‌జ్వేల్‌లో రైతుల రాస్తారోకో
State, Sangareddy

farmer’s protest | యూరియా కొరతపై నిర‌స‌న… గ‌జ్వేల్‌లో రైతుల రాస్తారోకో

farmer's protest in Gajwel : రైతులు మ‌ళ్లీ రోడ్డెక్కారు. యూరియా కొర‌త (urea shortage) వ‌ల్ల త‌మ పంట‌లు దెబ్బ‌తింటున్నాయ‌ని ఆందోళ‌నకు దిగారు. సిద్దిపేట జిల్లా (Siddipet District) గజ్వేల్ (Gajwel) సమీపంలోని రిమ్మనగూడ వద్ద రాజీవ్ ర‌హ‌దారిపై ఈ రోజు పెద్ద ఎత్తున రాస్తారోకో (rasta roko) చేపట్టారు. వర్షం పడుతున్నప్పటికీ వందలాది మంది రైతులు (Farmers) రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. రోడ్డు పైకి వందలాది మంది రైతులు ఈ రాస్తారోకో బీఆర్ఎస్ (BRS) నేతృత్వంలో జ‌రిగింది. వంద‌లాది మంది రైతులు భారీ సంఖ్య‌లో ఉద‌యం నుంచే గజ్వేల్ (Gajwel) వద్దకు చేరారు. రోడ్డు మధ్యలో కూర్చుని నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంట‌నే యూరియా సరఫరా చేయాల‌ని డిమాండ్ చేశారు. యూరియా ఇవ్వకపోతే పంటలు ఎండిపోతాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ బాధ‌ల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించ...
Heavy rainfall | తెలంగాణ‌లో ఆగ‌ని భారీ వ‌ర్షాలు.. అధికారులు అల‌ర్ట్
State, Adilabad, warangal

Heavy rainfall | తెలంగాణ‌లో ఆగ‌ని భారీ వ‌ర్షాలు.. అధికారులు అల‌ర్ట్

Heavy rainfall : తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో వివిధ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వాన‌లు ( heavy rainfall ) ప‌డ్డాయి. దీంతో జ‌న‌జీవ‌నం (Normal life) అస్త‌వ్య‌స్తంగా మారింది. మ‌రో రెండు, మూడు రోజుల్లోనూ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలిపారు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. Heavy rainfall : జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్తం భారీ వర్షాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి రవాణా అంతరాయం కలిగిస్తున్నాయి. చిన్న చిన్న చెరువులు, గుంటలు పొంగిపొర్లి లోత‌ట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుతోంది. పల్లెల్లో రహదారులు నీటమునిగిపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.పంట పొలాల్లోకి కూడా నీరు చేరడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండ‌గా కొన్ని ప్రాంతాల్లో వరదలు, ముంపు సమస్యలు తలెత్తుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం నీటి కొరత కొనసా...
TSLPRB Jobs 2025 : అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాల భర్తీ – త్వరలో 118 పోస్టుల నోటిఫికేషన్
Career

TSLPRB Jobs 2025 : అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాల భర్తీ – త్వరలో 118 పోస్టుల నోటిఫికేషన్

TSLPRB : తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (TSLPRB) ఓ ముఖ్యమైన ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రాసిక్యూషన్‌ విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వ‌ర‌లోనే విడుదల చేయ‌నుంది. దీని ద్వారా మొత్తం 118 పోస్టులు భర్తీ చేయనున్న‌ట్టు TSLPRB తెలిపింది. న్యాయ విద్య పూర్తిచేసి, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది అభ్యర్థులకు సువ‌ర్ణావ‌కాశ‌మ‌ని పేర్కొంది. TSLPRB Jobs 2025 : మొత్తం ఖాళీల వివరాలు మల్టీ జోన్ – I 38 పోస్టులు ప్రత్యక్ష నియామకంతో భర్తీ చేస్తారు. 12 పోస్టులు లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌ (బ్యాక్‌లాగ్‌) ద్వారా భర్తీ చేయనున్నారు. మల్టీ జోన్ – II 57 పోస్టులు ప్రత్యక్ష నియామకంతో భర్తీ చేస్తారు. 11 పోస్టులు లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌ కింద భర్తీ అవుతాయి.ఇలా మొత్తం 118 మందిని నియ‌మించ‌న...
UPI ద్వారా లంచాలు – ACB ఉచ్చులను తప్పించుకునే అవినీతి అధికారుల కొత్త ఎత్తులు
Special Stories

UPI ద్వారా లంచాలు – ACB ఉచ్చులను తప్పించుకునే అవినీతి అధికారుల కొత్త ఎత్తులు

UPI Bribe Scam | అవినీతి నిరోధక శాఖ (ACB) ఉచ్చులో ప‌డ‌కుండా కొంతమంది అవినీతి అధికారులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. బాధితుల నుంచి నేరుగా నగదు తీసుకోవడానికి బదులుగా, అధికారులు లంచం మొత్తాన్ని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ( UPI ) ద్వారా పంపమని అడుగుతున్నారు. ఇలా చేయ‌డం ద్వారా వారు ACB దాడుల నుంచి తప్పించుకోవచ్చని భావిస్తున్నారు. సాధారణంగా, బాధితుల నుంచి కెమిక‌ల్ పౌడ‌ర్ పూసిన కరెన్సీ నోట్లను స్వీకరించేటప్పుడు ACB అధికారులు అధికారులను వారి వేలిముద్ర‌ల‌తో ట్రాప్ చేస్తారు. ఇతర ఆధారాలతో పాటు, కరెన్సీ నోట్లపై ఉన్న అధికారుల వేలిముద్రలు కోర్టులో కేసును నిరూపించడానికి ACBకి బలమైన సాక్ష్యంగా నిలుస్తుంది. అయితే దీనిని నివారించడానికి, అధికారులు బాధితులను లంచం మొత్తాన్ని PhonePe, Google Pay, Paytm వంటి UPI యాప్‌ల ద్వారా పంపమని అడుగుతున్నారు. మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, బాధితు...
error: Content is protected !!