Floods : వరదల్లో కారుతో సహా కొట్టుకుపోయిన ఫ్యామిలీ
                    మహారాష్ట్రలోని ఉద్గిర్ సమీపంలో వరద (Floods) ల్లో తెలంగాణకు చెందిన ఫ్యామిలీ గల్లంతయింది. ఒకే కుటుంబానికి  చెందిన నలుగురు కారుతో సహా వరద నీటిలో కొట్టుకుపోవడం కలకలం రేపింది.  మేం వరదల్లో కొట్టుకుపోతున్నాం, పిల్లలూ జాగ్రత్త అంటూ చివరి ఫోన్ కాల్ వచ్చిందని.. ఆ తర్వాత స్విచ్ఛాప్ వచ్చిందని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నలుగురు ఆచూకీ వెంటనే గుర్తించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్ కు చెందిన ఐదుగురితో పాటు మహారాష్ట్రకు చెందిన కారు డ్రైవర్ వాహనాన్ని నడుపుతుండగా ఆగస్ట్ 17న అర్ధరాత్రి మహారాష్ట్రలోని వరద నీటిలో కొట్టుకుపోయింది. మహారాష్ట్రలోని ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఉద్గిర్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 
కాగా, గల్లంతైన వారిలో అఫ్రీనా, హసీనా, సమీనా, ఆఫ్రీన్, సోహెబ్ అనే యువకుడు, మహారాష్ట్ర కు చెందిన కారు డ్రైవ...                
                
             
								
