Telangana Rains | మరో రెండురోజులు భారీ వర్షాలు..
                    Telangana Rains | తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈమేరకు గురువారం ఆదిలాబాద్, కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్‌గిరి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఇక శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షపాతం ఉండే సూచనలున్నాయని తెలిపింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయం...                
                
             
								

