Rabies Fear | కూతురిని హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడిన తల్లి.. మహబూబ్‌నగర్‌లో విషాదం
Mahbubnagar | కూతురికి రేబిస్ (Rabies) సోకిందన్న అనుమానంతో ఓ మహిళ తన కూతురిని చంపి, ఆపై ఆత్మహత్యకు పాల్పడింది. ఈ షాకింగ్ ఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యశోద అనే గృహిణికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో రేబిస్ వ్యాధి సోకుతుందేమోనన్న అనుమానంతో మానసికంగా కుంగిపోయి తన కూతురిని చంపి, తానూ ఆత్మహత్యకు పాల్పడింది.
ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ముందు.. కుమారుడు లక్కీ, భర్త జాగ్రత్త..! అంటూ యశోద చాక్ బోర్డు, డోర్ల మీద రాసింది. రేబిస్ వాక్సిన్ (Rabies Vaccine) తీసుకున్నప్పటికీ.. అది వ్యాక్సిన్‌తో తగ్గదు, చెట్ల మందు తీసుకోవాలి, పత్యం చేయాలని భర్త నరేష్‌కు పలు రకాలుగా విన్నవించింది. తనకు, తన కూతురుకి రేబిస్ వ్యాధి సోకిందని అందోళన చెందింది. అదే అనుమానంతో వ్యాక్సిన్ సైతం తీసుకుంది....

