Holidays | వర్షాల ఎఫెక్ట్.. 13 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు
వరంగల్ : తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 13 జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవులు (Holidays) ప్రకటించింది. అందులో నల్లగొండ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, సిద్దిపేట, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు.
భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయకు రాకూడదని అధికారులు సూచించారు. వర్ష ప్రభావం కారణంగా కామారెడ్డి జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు ఆగస్ట్ 29, 30 వరకు సెలవులు ప్రకటించినట్లు ప్రభుత్వం తెలిపింది. భారీ వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సెలవులను మరో రెండు రోజులు పొడిగించింది. అందువల్ల పాఠశాలలు, కళాశాలలు బంద్ కానున్నాయి.సిద్దిపేట జిల్లాలో గత రెండు ...

