Kaleshwaram : కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు.. హరీష్ రావుపై నిప్పులు
బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వరం (Kaleshwaram )పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్‌రావుపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. “కేసీఆర్‌పై నిందలు రావడానికి ప్రధాన కారణం హరీష్‌రావేనా? ఆయన వెనుక సంతోష్, సీఎం రేవంత్ ఉన్నారా? నా మీద పెద్ద ఎత్తున కుట్రలు జరిగాయి. మా నాన్నపై సీబీఐ ఎంక్వైరీకి కారణం అదే. నా కడుపు రగిలిపోతుంది” అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
“మా నాన్న కేసీఆర్‌కి తిండి మీదా, డబ్బు మీదా ఎలాంటి ఆపేక్ష లేదు. ఆయన తరతరాల సంపదను తెలంగాణ ప్రజలకే ఇచ్చారు. కానీ ఆయన పక్కన ఉన్న కొందరి వల్లే ఈ పరిస్థితే వచ్చింది. కాళేశ్వరం వివాదం మొత్తం అప్పటి మంత్రి హరీష్‌రావు వల్లే జరిగింది. కేసీఆర్‌కి అవినీతి మరక ఎలా వచ్చింది అనేది అందరూ చూడాలి. కేసీఆర్‌పై విచారణ తర్వాత కూడా బీఆర్‌ఎస్ నిలుస్తుందా లేదా అన్నది చూడాలి” అని ఆమె వ్యాఖ్యానించారు. “నేను ఇలా మాట్లాడితే పార్టీకి స్థాని...


