Venky | వెంకటేష్‌తో మళ్లీ కాంబోకి సిద్ధమైన వీవీ వినాయక్..!
                    VV Vinayak Venky combo | టాలీవుడ్ లో సుమోలు లేపే డైరెక్టర్ ఎవరంటే ఎవరైనా వీవీ వినాయక్ (VV Vinayak)అనే చెబుతారు. అంతలా ఆడియన్స్ ను తన మాస్ ఎలివేషన్ లతో మెస్మ రై జ్ చేశారు. అందరి హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ డైరెక్టర్ చాలా కాలం తరువాత మెగాఫోన్ పట్టబోతున్నారు.చిరు రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 (khaidhi no 150) తరవాత వినాయక్ కి అంత రేంజ్ లో హిట్టు పడలేదు.సాయి ధరమ్ తేజ్(sai Dharam tej)తో ఇంటెలిజెంట్ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.
హీరోగా వినాయక్….
ఆ తరవాత కొద్ది గ్యాప్ తీసుకున్న వినాయక్ హీరోగా ఓ మూవీ కూడా అనుకున్నారు. దిల్ రాజు బ్యానర్ లో శీనయ్య (seenayya)అనే టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కొద్ది షూట్ కూడా అయిపోయినా తరవాత మూవీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. దీంతో మళ్లీ డైరెక్షన్ వైపు వెళ్ళి బెల్లంకొండ శ్రీనివాస్ తో హిందీలో ఛత్రపతి రీమేక్ చేశాడు. ఈ మూవీ విన...                
                
             
								


