Harish Rao : పిల్లల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
                    సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు
Hyderabad : విష జ్వరాలు, పాము కాట్లు, ఎలుక కాట్లు, కుక్క కాట్లు, ఫుడ్ పాయిజనింగ్‌తో విద్యార్థులు ఆస్పత్రుల పాలవున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యావ్యవస్థ దీనస్థితికి చేరాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు.
గురుకులాల్లో 2,500 మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు చెల్లించనిదుస్థితి నెలకొందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఆడంబరంగా ప్రకటనలు చేయడం కాదు ముందు వారికి సకాలంలో జీతాలు చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ స్వయంగా తానే ఇకపై గురుకులాలను పర్యవేక్షిస్తానని చెప్పిన మాటలు ఉత్తమాటలయ్యాయని విమర్శించారు. కల్తీ ఆహారం పెడితే జైలుకే అని ఇచ్చిన ప్రకటనలు చేశారని కానీ, అవి గాలి మాటలయ్...                
                
             
								
