Tollywood | నితిన్ – శ్రీను వైట్ల – మైత్రి మూవీ మేకర్స్: ఊహించని కాంబో సెటప్?
Tollywood News | సినిమా ఇండస్ట్రీ లో అప్పుడప్పుడు ఆడియన్స్ ఊహించని కాంబోలు సెట్ అవుతూ సర్ప్రైజ్ ఇస్తుంటారు. హిట్స్ లో ఉన్న డైరెక్టర్ తోనే ఏ హీరో అయినా చేయాలనుకుంటారు. అలాగే హిట్స్ లో ఉన్న హీరో తో చేస్తే నే మూవీ పై హైప్ క్రియేట్ అవుతుందని డైరెక్టర్ అనుకుంటాడు. ఇక ప్రొడ్యూసర్స్ కూడా హిట్టు కొట్టిన వాళ్ల వెంటనే పడుతుంటారు. కానీ ఇప్పుడు ఒక డిఫరెంట్ కాంబో సెట్ అయినట్టు ఫిలిం నగర్ లో టాక్ వినబడుతోంది.
ఈ కాంబో రిస్క్ చేస్తోందా… ?
మైత్రి మూవీ మేకర్స్(maithri movie makers)బ్యానర్ లో నితిన్(nithin) హీరోగా శ్రీను వైట్ల(Sreenu vaitla)డైరెక్షన్ లో ఓ మూవీ తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురు కూడా హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు. కొంతకాలంగా నితిన్ వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతున్నారు. ఇక శ్రీను వైట్ల హిట్టు కొట్టి చాలా కాలమే అయిపోయింది. ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోయిన మైత్రి బ్యానర్ కు క...



