Harish Rao | విద్యార్థులకు డబ్బుల్లేవు.. కానీ టెండర్లకు లక్షల కోట్లు ఎక్కడివి?
                    ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై హరీశ్ రావు ఆగ్రహం
హైదరాబాద్ : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధుల విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని మాజీ మంత్రి టీ హరీశ్ రావు (BRS MLA Harish Rao )  విమర్శించారు. రెండేళ్లుగా యాజమాన్యాలు నిధులు ఇవ్వమని వేడుకుంటున్నా, రేవంత్ సర్కారు మోసపూరిత వైఖరి అవలంబిస్తోందని ఆయన మండిపడ్డారు.ఈసందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్ కళాశాలలు మూతపడే పరిస్థితి వచ్చింది.దాదాపు 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాల్సిన దశ రావడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి తానే విద్యాశాఖ మంత్రిగా ఉన్నా చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరంగా ఉన్నాయి. ఇప్పటికే సెప్టెంబర్ 16 నుంచి విద్యాస...                
                
             
								

