TTD : తిరుమలలో యాచకులు, అనధికార వ్యాపారులపై ప్రత్యేక డ్రైవ్
                    త్వరలో బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యలు
తిరుమల: సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 02 వరకు తిరుమలలో జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను (Tirumala Brahmotsavam 2025) దృష్టిలో ఉంచుకుని, టిటిడి (TTD) చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు, ఆరోగ్య విభాగం సిబ్బంది, తిరుమల పోలీసులతో కలిసి తిరుమలలో అనధికార వ్యక్తులు, యాచకులను ఇక్కడి నుంచి పంపించేందుకు (Beggars Eviction) ఆదివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
కల్యాణకట్ట, SV షాపింగ్ కాంప్లెక్స్ సమీపంలోని షెడ్లలో చాలా కాలంగా ఉంటున్న యాచకులు, అక్రమ వ్యాపారులను తిరుమల నుంచి బహిష్కరించారు. పోలీసులు, TTD విజిలెన్స్, హెల్త్ & శానిటేషన్ అధికారులు ఎటువంటి పర్మిట్లు లేకుండా వ్యాపారం చేస్తున్న 82 మంది అనధికార వ్యాపారులను, ఇక్కడ చాలా...                
                
             
								

