Future City : ఫ్యూచర్ సిటీపై వెనుకడుగు లేదు..
                    భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు (Bharat Future City)పై వెనుకడుగు వేసేది లేదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి (Chief Minister A Revanth Reddy) తేల్చి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి (development of the State)కి ఇది తప్పనిసరి అన్నారు. రైతుల నిరసనల పేరుతో ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ప్రాజెక్ట్ కోసం భూములు, ఇళ్లను ఇవ్వాలని నోటిఫై చేసిన గ్రామాల ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ (Hyderabad)లో ఈ రోజు జరిగిన తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవం (Telangana Praja Palana Dinotsavam) సందర్భంగా సీఎం తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’పై మరోసారి మాట్లాడారు.
అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రతిపక్షాల ఉద్దేశం
రైతులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ ఇవన్నీ ప్రతిపక్ష పార్టీల (opposition parties) ప్రేరేపించడం వల్లే జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్...                
                
             
								



