మెగాస్టార్‌తో మిరాయి డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కొత్త ఛాన్స్! -Karthik Gattamneni
                    Karthik Gattamneni Next Movie 2025 : మిరాయి మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamaneni). తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచిన మూవీగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉందని ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మౌత్ టాక్ తో సినిమాకు భారీ కలెక్షన్స్ వస్తున్నాయి.
ఇప్పటికే దాదాపు 88 కోట్లు కొల్లగొట్టినట్టు మూవీ టీం ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఇంతటి భారీ వసూళ్లు రీసెంట్ గా ఏ మూవీకి కూడా రాలేదు. కార్తీక్ ఘట్టమనేని కి డైరెక్టర్ గా ఇది రెండవ సినిమానే. ఫస్ట్ సూర్య వర్సెస్ సూర్య లాంటి ఎక్స్పరిమెంట్ మూవీ తీసి డీసెంట్ హిట్టు అందుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత మిరాయి లాంటి భారీ మూవీ తీసి ఆడియన్స్ ను థ్రిల్ చేశాడు.
కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamneni) డైరెక్టర్ కాకముందు సినిమాటోగ్రాఫర్ గా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఎక్స్ ప్రెస్ రాజ...                
                
             
								
