Medaram | మరింత విశాలంగా మేడారం గుడి ప్రాంగణం
                    Medaram Temple | ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆదివాసి జాతరగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణం (Medaram Temple) అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. మేడారం ఆలయానికి విచ్చేసే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతున్న నేపథ్యంలో, పూజారుల అభిప్రాయాలు, ఆలోచనల మేరకు అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో గురువారం సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఆలయ అభివృద్ధికి సంబంధించి డిజైన్లు దాదాపు ఖరారు చేశారు. సీఎం ఆమోదం తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి. సీఎం ఆమోదం తర్వాత ఆలయ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని శంకుస్థచేస్తారని మంత్రులు ప్రకటించారు.
ప్రస్తుతం మేడారం ఆలయ ప్రాంగణంలో ఒకేసారి సుమారు 7,000 మంది భక్తులు తల్లులను దర్శించుకునే సౌకర్యం ఉంది. అయితే విస్తరణ పనులు పూర్తయ్య...                
                
             
								



