Hyderabad | వరద ప్రవాహంలో గల్లంతై యువకుడి మృతి
                    Hyderabad rains : హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం మరో ప్రాణాన్ని బలిగొంది. ముషీరాబాద్‌కు చెందిన యువకుడు నిన్న అర్ధరాత్రి ఇంటికి తిరిగి వెళ్తుండగా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గాలింపు అనంతరం అతడి మృతదేహాన్ని ఈరోజు ఉదయం బాల్కంపేట్ రైల్వే అండర్‌బ్రిడ్జ్ వద్ద పోలీసులు గుర్తించారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే..
బుధవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో షరీఫుద్దీన్ (27) తన బైక్‌పై బాల్కంపేట్ నుంచి బేగంపేట్ వైపు వెళ్లాడు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో రోడ్లు మొత్తం నీళ్లు ముంచెత్తాయి. బలమైన నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక వాహనం సహా షరీఫ్ కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు రాత్రంతా గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. చివరికి గురువారం ఉదయం అతడి మృతదేహం బాల్కంపేట్ అండర్‌పాస్ దగ్గర లభించింది.
 Hyderabad లో వర్షపాతం ఇలా..
బుధవారం రాత్రి హైదరాబాద్ నగరంపై ఒక్కసారిగా భారీ వర్షం కు...                
                
             
								
