Mahabubnagar : అమెరికాలో పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువకుడు మృతి
                    Mahabubnagar : అమెరికా (United States)లో జరిగిన ఓ ఘటనలో మహబూబ్‌నగర్ జిల్లా రమయ్యబౌళి ప్రాంతానికి చెందిన యువకుడు పోలీసుల కాల్పుల కు గురై ప్రాణాలు (shot dead) కోల్పోయాడు. 15 రోజుల క్రితమే ఈ సంఘటన జరిగినప్పటికీ అతడి స్నేహితులు ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మహబూబ్‌నగర్ జిల్లా రమయ్యబౌళి ప్రాంతానికి చెందిన నిజాముద్దీన్ (34) 2016లో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. చదువులు పూర్తయ్యాక కాలిఫోర్నియా (California)లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. నలుగురితో కలిసి ఓ రూమ్‌ను అద్దెకు తీసుకొని నివసిస్తున్నాడు. ఈ క్రమంలోనే రూమ్‌మేట్స్‌తో విభేదాలు ఉధృతమై చివరికి ప్రాణాంతక పరిణామానికి దారితీశాయి.
రూమ్‌మేట్స్‌తో వాగ్వాదం.. పోలీసుల కాల్పులు
కాలిఫోర్నియా (California) మీడియా కథనాల ప్రకారం.. నిజాముద్దీన్, అతడి రూమ్‌మేట్స్ మధ్య తీవ్ర వాగ్వాదం జ...                
                
             
								


