Sarkar Live

Day: September 21, 2025

తెలంగాణలో రాజకీయ వేడి.. హీటెక్కిన ‘ఫిరాయింపుల’ వివాదం – Telangana Politics
Special Stories

తెలంగాణలో రాజకీయ వేడి.. హీటెక్కిన ‘ఫిరాయింపుల’ వివాదం – Telangana Politics

తెలంగాణలో రాజకీయం (Telangana Politics) రోజురోజుకూ వేడెక్కుతోంది. వర్షకాలంలోనూ పాలిటిక్స్ హీటెక్కి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు కొందరు అధికార కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడంపై నెలకొన్న వివాదం తారస్థాయికి చేరింది. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వాగ్యుద్ధం జోరందుకుంది.పార్టీలు మారడమనేది తెలంగాణ రాజకీయాల్లో కొత్తదేమీ కాదు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి పలు మార్లు ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అయితే.. ఈసారి మాత్రం ఫిరాయింపు వివాదం ఇంకాస్త ముదిరిందని తెలుస్తోంది. ఇది రాజకీయ వర్గాల్లోనూ ప్రజాక్షేత్రంలోనూ పెద్ద చర్చకు దారితీసింది. ఫిరాయింపుల వెనుక కారణాలు ఇవేనా? ఎమ్మెల్యేలు ఒక పార్టీని వదిలి మరొక పార్టీలో చేరడానికి అనేక కారణాలు ఉంటాయి. కొందరు వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. మరికొందరు తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార పార...
Son kills mother | కొడుకు చేతిలో త‌ల్లి హ‌తం.. మ‌ద్యం మ‌త్తులో ఉన్మాదం
Crime

Son kills mother | కొడుకు చేతిలో త‌ల్లి హ‌తం.. మ‌ద్యం మ‌త్తులో ఉన్మాదం

Son kills mother : రంగారెడ్డి జిల్లా చెవెళ్ల (Chevella)లో జరిగిన దారుణ సంఘటన క‌ల‌కలం రేపింది. మద్యం మత్తులో ఓ వ్య‌క్తి క‌న్నత‌ల్లిని కొడ‌వ‌లితో దాడి చేసి హ‌త‌మార్చాడు. ఆ తర్వాత గ్రామస్థులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. చెవెళ్ల‌ మండలంలోని రెగడఘనపూర్ గ్రామం (Regadghanapur)లో నివసిస్తున్న జంగయ్య తన తల్లి నర్సమ్మ (75)తో కలిసి ఉండేవాడు. మద్యం మత్తులో అత‌డు తల్లితో ఏదో ఒక విష‌యంపై వాగ్వాదానికి దిగాడు. కొద్ది సేపటికే అత‌డు మ‌రింత కోపోద్రిక్తుడై విచ‌క్ష‌ణ కోల్పోయి ఉన్మాదిగా మారాడు. ఇంట్లోనే ఉన్న కోడవలిని తీసి త‌ల్లిపై దాడి చేసి (attacking) అత్యంత కిరాత‌కంగా గాయ‌ప‌ర్చాడు. దీంతో ఆమె అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. ఈ ఘటన శనివారం రాత్రే జరిగినప్పటికీ ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నర్సమ్మ మృతదేహం కనిపించడంతో గ్రామస్థులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే జంగయ్యను పట్టుకొని చెట్...
vaccination| వ్యాక్సిన్ వేయ‌గానే శిశువు మృతి
Crime

vaccination| వ్యాక్సిన్ వేయ‌గానే శిశువు మృతి

Boy dies after vaccination : వాక్సిన్ తీసుకున్నగంట వ్య‌వ‌ధిలోనే నాలుగు నెల‌ల శిశువు మృతి చెందిన (boy dies) సంఘ‌ట‌న కరీంనగర్ జిల్లా జ‌మ్మికుంట (Jammikunta) మండ‌లం పాప‌క్క‌ప‌ల్లిలో క‌ల‌క‌లం రేపింది. టీకా ప్రభావమేనా లేక వేరే కారణమా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వ్యాక్సిన్ (vaccine) వ‌ల్లే త‌మ బిడ్డ మృతి చెందాడ‌ని త‌ల్లిదండ్రులు ఆరోపిస్తుండ‌గా వైద్యులు మాత్రం కార‌ణం అది కాద‌ని అంటున్నారు. ఇత‌ర అనారోగ్య కార‌ణం వ‌ల్ల శిశువు మృతి చెంది ఉండొచ్చ‌ని వాదిస్తున్నారు. పాపక్కపల్లి గ్రామానికి చెందిన లింగాల అంజి, హర్షిత దంపతులు తమ నాలుగు నెలల బిడ్డను వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. శిశువుకు ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం అక్క‌డి వైద్య సిబ్బంది RVV-2 (రోటా వైరస్ వ్యాక్సిన్), Penta-2 (డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్, హెపటైటిస్-బి, Hib కలిపిన టీకా) వేశారు. ఈ టీకాలు సాధారణంగా శిశువు...
Rains | నేడు ఐదు జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక
State

Rains | నేడు ఐదు జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక

Telagnana Rains | బంగాళాకాతంలో ఏర్ప‌డిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీవర్షాలు (Rains) కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చ‌రించింది. పలు జిల్లాల్లో కుండపోతగా వాన కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, సిరిసిల్ల, జగిత్యాల, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మానుకోట‌, పాల‌మూరు, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains ) కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇక సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి పాల‌మూరు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు వాత...
error: Content is protected !!