Sarkar Live

Day: September 22, 2025

పిడిఎస్ డాన్ కొత్త ‘తాడు’ వ్యూహం – అక్రమ దందాలో కొత్త మలుపు! – PDS Rice Racket
Special Stories

పిడిఎస్ డాన్ కొత్త ‘తాడు’ వ్యూహం – అక్రమ దందాలో కొత్త మలుపు! – PDS Rice Racket

‘కోటి’ వ్యూహాలతో తాడాటకు టర్న్ తీసుకున్న పిడిఎస్ డాన్ తాడు మీద కోటి ఆశలు – డాన్ నడిపిస్తున్న కొత్త దందా! గుట్టుగా సాగుతున్న తాడాట – పిడిఎస్ డాన్ కథ‌లో కొత్త మలుపు! PDS Rice Racket in Telangana | గత కొన్నిసంవత్సరాలుగా పిడిఎస్ డాన్ గా చెలామణి అవుతూ 'కోటి' వ్యూహాలతో కోట్లకు పడగలెత్తిన సదరు వ్యక్తి ఇటీవలికాలంలో కొత్తగా "తాడు" వ్యూహం పన్నినట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో పిడిఎస్ డాన్ పిడిఎస్ దందాకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. దాంతో అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ సదరు వ్యక్తి "కోటి" వ్యూహాలతో "తాడాట" మొదలుపెట్టినట్లు సమాచారం. పిడీఎస్ బియ్యం దందా (PDS Rice Racket) లో ఆరితేరిన అతగాడు తాడాటను కూడా గుట్టుగా నడిపిస్తూ బాగానే వెనకేసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. హన్మకొండ జిల్లాలోని జన సందోహ...
Chhattisgarh | ఛత్తీస్‌గఢ్ నారాయణ్‌పూర్‌లో ఎన్‌కౌంటర్
National

Chhattisgarh | ఛత్తీస్‌గఢ్ నారాయణ్‌పూర్‌లో ఎన్‌కౌంటర్

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో సోమవారం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక నక్సలైట్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్రకు ఆనుకుని ఉన్న అభుజ్‌మాద్ ప్రాంతంలోని అడవిలో ఉదయం భద్రతా దళాల బృందం సోదాలు నిర్వహిస్తుండగా కాల్పులు జరిగాయని ఇక్కడి పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆ ప్రాంతంలో నక్సలైట్లు ఉన్నారనే సమాచారం అంద‌డంతో ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు, ఒక నక్సలైట్ మృతదేహాన్ని సంఘటనా స్థలం నుండి స్వాధీనం చేసుకున్నామని, ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ ఏడాది 248 మంది నక్సలైట్లు హతం తాజా ఎన్‌కౌంట‌ర్‌తో ఈ సంవత్సరం ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 248 మంది నక్సలైట్లు హతమయ్యారు. వారిలో 219 మంది ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ డివిజన్‌లో హతమార్చబడ్డారు, మరో 27 మంది రాయ్‌పూర్ డివిజన్‌లోని ...
Accident |  జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు మృతి, ఇద్దరు గాయాలు
Crime

Accident | జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు మృతి, ఇద్దరు గాయాలు

Mahabubnagar Accident News : మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ (Rajapur mandal) మండల కేంద్రం వద్ద జాతీయ రహదారి (National Highway-44)పై ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం (road accident) చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాలు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… హైదరాబాద్ (Hyderabad) నుంచి నంద్యాల (Nandyal) దిశగా వెళ్తున్న కారు అధిక వేగంతో ప్రయాణిస్తుండ‌గా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. వేగాన్ని అదుపులో పెట్టుకోలేక ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టాడు. దీంతో రెండు కార్లూ నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో చిక్కేపల్లి గ్రామానికి చెందిన బీరాం రంజిత్‌కుమార్ రెడ్డి, అతని బంధువు హరిక అక్కడికక్కడే మృతి చెందారు. వీరిద్దరూ హైదరాబాద్ వైపు వెళ్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరి మృతితో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది.మరో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్య...
Heavy rains | మళ్లీ ముంచెత్తనున్న వర్షాలు.. ఎల్లో అల‌ర్ట్ జారీ
State, Hyderabad

Heavy rains | మళ్లీ ముంచెత్తనున్న వర్షాలు.. ఎల్లో అల‌ర్ట్ జారీ

Heavy rains : భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ (Hyderabad) కేంద్రం తాజాగా జారీ చేసిన అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఏడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇప్పటికే సెప్టెంబరు చివరి వారంలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని సూచనలు వెలువడగా, ఇప్పుడు మరింత స్పష్టమైన హెచ్చరికను విడుదల చేశారు. మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు రాష్ట్రమంతా భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తూ India Meteorological Department (IMD) ఎల్లో అలర్ట్ (yellow alert) జారీ చేసింది. సెప్టెంబరు 28 వరకు ఇది కొనసాగనుంది. తెలంగాణ‌లోని ఉత్త‌ర‌, మ‌ధ్య‌, ప‌శ్చిమ‌, తూర్పు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంద‌ని IMD వెల్ల‌డించింది. పలు జిల్లాల్లో వర్షాలు, పిడుగులు, ఈదురుగాలులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని తెలిపింది. కొన్ని రోజులుగా ఉష్ణోగ్ర‌త‌లు...
తెలంగాణలో Next-Gen GST అమలు ప్రారంభం | New GST Slabs 5% & 18%
Business

తెలంగాణలో Next-Gen GST అమలు ప్రారంభం | New GST Slabs 5% & 18%

Next-Gen GST : తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా నెక్ట్స్ జ‌న‌రేష‌న్‌ జీఎస్టీ (next generation GST) విధానాన్ని అమ‌ల్లో తెచ్చేందుకు రంగం సిద్ధ‌మైంద‌ని వాణిజ్య పన్నుల కమిషనర్ కె.హరిత (K Haritha, Commissioner of Commercial Taxes) వెల్లడించారు. కేంద్ర జీఎస్టీ కౌన్సిల్ తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం పన్ను స్లాబ్స్‌లో మార్పులు చేసి కొత్త నోటిఫికేషన్లు (notifications) విడుదలయ్యాయ‌ని, వాటిని రాష్ట్రం వెంటనే అమలులోకి తెచ్చిందని ఆమె ఈ రోజు వెల్ల‌డించారు. 'మా విభాగం ఇప్పటికే క్షేత్ర‌ స్థాయిలో అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. వ్యాపారులు, పన్ను చెల్లింపుదారులు కొత్త పద్ధతిని ఎలా అనుసరించాలో వివ‌రించాం. అయినప్పటికీ అసలు సమస్యలు వచ్చే నెలలో రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో మాత్రమే బయటపడతాయి' అని అని కూడా హరిత తెలిపారు. ప్రస్తుతం త‌మ విభాగం తరఫున ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని కమిషనర్ ...
error: Content is protected !!