Kaleshwaram Project కేసులో కీలక మలుపు.. సీబీఐ విచారణ ప్రారంభం
                    Kaleshwaram Project : కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రాథమిక విచారణ (Preliminary Enquiry)ను ప్రారంభించింది. ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ముందడుగు వేసింది. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు ధృవీకరించాయి.కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నిర్మాణంలో జరిగినట్లు ఆరోపిస్తున్న అనేక అవకతవకలపై సీబీఐ ఇప్పుడు సమగ్రంగా దర్యాప్తు చేపట్టనుంది. ప్రాథమిక విచారణలో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పత్రాలు, ఒప్పందాలు, చెల్లింపుల వివరాలు, కాంట్రాక్టర్ కంపెనీల రికార్డులు, ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలను పరిశీలించనుంది. ప్రధానంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) సమర్పించిన నివేదిక ఈ విచారణకు కీలక ఆధారంగా మారనుంది. ఇంజినీరింగ్ లోపాలు, నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘనలు, నిర్మాణంలో తీసుకున్న అనుచిత నిర్ణయాలు వంటి అనేక అంశాలను ఆ ని...                
                
             
								



