స్థానిక ఎన్నికల షెడ్యూల్ పూర్తి వివరాలు ఇవే.. ఎలక్షన్స్ – Local Body Elections
Local Body Elections : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు (Telangana Gram Panchayat Elections 2025) అంతా సిద్ధమైంది. అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఐదు దశల్లో విడుతల్లో పోలింగ్ ను నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో, సర్పంచ్ ఎన్నికలను మూడు దశల్లో జరిపించనున్నారు.ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం ప్రకటించారు. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడుత పోలింగ్, అదే నెల 27న రెండో విడుత పోలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 17న సర్పంచ్ ఎన్నికలకు తొలి విడుత నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అక్టోబర్ 31న సర్పంచ్ ఎన్నికల తొలి విడుత పోలింగ...