Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం
Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరంలో దెబ్బతిన్న ముఖ్యమైన బ్యారేజీలను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అవసరమైన కొత్త డిజైన్లను రూపొందించేందుకు అంతర్జాతీయ స్థాయి కంపెనీల నుంచి ఆహ్వానానికి నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ క్రమంలో జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) దర్యాప్తు ఆధారంగా పునరుద్ధరణ చేయాలని నిర్ణయించింది. ఇక, వచ్చిన డిజైన్ టెండర్లను ప్రభుత్వం సీల్డ్ కవర్‌లో ఉంచుతుంది. ఈనెల 15న టెండర్లను ప్రభుత్వం తెరువనుంది.కాగా, కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు ఈవోఐ పిలవాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా గత నెల 19న ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత కేవలం రెండు వారాల్లోగా డిజైన్ కన్సల్టెంట్‌ను ఎంపిక చే...
