South Central Railway | దక్షిణ మధ్య రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం
                    Hyderabad | దక్షిణ మధ్య రైల్వే (SCR- South Central Railway) ఈ ఏడాది ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య కాలంలో సరుకు రవాణా, ప్రయాణీకుల రైళ్ల విభాగాలలో అత్యుత్తమ పనితీరును నమోదు చేసింది. గత సంవత్సరం అత్యధికంగా రూ.9,966 కోట్ల స్థూల ఆదాయాన్ని అధిగమించి రూ.10,143 కోట్ల స్థూల ఆదాయాన్ని ఆర్జించింది.
SCR అధికారుల ప్రకారం, ఈ జోన్ 71.14 మిలియన్ టన్నుల (MTs) ఆల్ టైమ్ హై సరకు రవాణాను సాధించింది. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో 67 MTల నుంచి 6 శాతం పెరిగి, ఆదాయానికి రూ.6,635 కోట్లను అందించింది. ఇనుప ఖనిజం, ఉక్కు కర్మాగారాలకు ముడి పదార్థాలు, సిమెంట్ రవాణా పెరగడం వల్ల ఈ పెరుగుదల ప్రధానంగా జరిగిందని SCR జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు.
కాగా ప్రయాణీకుల ఆదాయం కూడా దక్షిణమధ్య రైల్వే వృద్ధిని నమోదు చేసుకుని రూ.2,991 కోట్లకు చేరుకుంది. ఇది 2024-25లో రూ.2,909 కోట్ల నుంచి 2.8 శాతం పెరిగింది. . వందే భారత...                
                
             
								



