Mohan Babu | కలెక్షన్ కింగ్ మళ్లీ బిజీ కానున్నాడా..?
ఒకప్పుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) రూటే సపరేటు. విలన్ గా చాలా మంది వచ్చినా మోహన్ బాబు తనదైన డైలాగ్ డెలివరీతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్, ఏ ఎన్ఆర్, చిరంజీవి లాంటి పెద్ద హీరోల సినిమాల లో కూడా విలన్ గా పోటా పోటీగా మెప్పించాడు. నెగిటివ్ రోల్ లో క్రూరంగా యాక్ట్ చేసి అదరగొట్టారు. ఆ తర్వాత హీరోగా మారి కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు.ప్రొడ్యూసర్ గా మారి సూపర్ హిట్స్ అందించాడు.
రెండున్నర దశాబ్దాల క్రితం మోహన్ బాబు రేంజ్ వేరు. ఆయన నుండి మూవీ వస్తుందంటే ఆడియన్స్ ఈగర్లీ వెయిట్ చేసేవారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీసిన బుజ్జిగాడు లో కూడా పవర్ ఫుల్ గా యాక్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా ఆయన రేంజ్ కు తగ్గట్టుగా ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు.
పవర్ ఫుల్ మూవీతో కంబ్యాక్..
చాలా కాలం తర్వాత ఒక పవర్ ఫుల్ మూవీ తో కంబ్యాక్ ఇస్తున్నారు. నాచురల్ స్టార్ నాని(natural...
