BC Reservations : బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
హైదరాబాద్: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశంపై సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి ఉపశమనం కల్పించింది. బీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఈ కేసు హైకోర్టులో ఇప్పటికే విచారణలో ఉందని, అదే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల శాతం పెంపుపై పిటిషనర్ వంగా గోపాల్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ సందర్భంగా, “హైకోర్టులో కేసు కొనసాగుతుండగా ఇక్కడకు ఎందుకు వచ్చారు?” అని ధర్మాసనం పిటిషనర్ తరఫు లాయర్‌ను ప్రశ్నించింది. దీనికి ప్రతిగా ఆయన “హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది” అని సమాధానమిచ్చారు. ఆపై ధర్మాసనం, “అక్కడ స్టే నిరాకరించి...
