జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కొత్త సంస్కరణలు – Jubilee Hills bye-election
                    Jubilee Hills bye-election | ముఖ్య ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ప్రవేశపెట్టిన కొత్త ఎన్నికల సంస్కరణలతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. తొలిసారిగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో అమల్లోకి వస్తున్నాయని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక (Jubilee Hills bye-election)షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో, ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి మంగళవారం వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం తదితర పార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ ఎన్నికల్లో ఎన్నికల సంఘం చేపట్టనున్న చర్యలను ఆయా పార్టీల నేతలకు వివరించారు.
కొత్త సంస్కరణలు ఇవీ..
ఒక్కో...                
                
             
								

