Gold Price | పసిడి రికార్డు ధరలు – షాకవుతున్న జనం
                    Gold Price Today : కొద్దిరోజులుగా బంగారం ధరలు తారాజువ్వలా నింగికెగసిపోతున్నాయి. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కారణంగా కనీవినీ ఎరుగని రీతిలో బంగారం ధర రోజుకో సరికొత్త రికార్డును నమోదు చేస్తోంది. మొన్నటి వరకు 10 గ్రాముల ధర రూ.లక్ష దాటితేనే అవాక్కయిన జనం తాజాగా రూ.1.25 లక్షలకు చేరుకోవడం చూసి షాక్ అవుతున్నారు. పుత్తడి ఔన్సు తొలిసారి 4వేల డాలర్ల మార్కును దాటింది. అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్‌డౌన్, ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై నెలకొన్న అనిశ్చితులు పసిడికి తాజాగా డిమాండ్ పెంచుతున్నాయి. బంగారం ధర బుధవారం మరింత పెరిగింది. ఒక్కరోజే రూ.2,290 పెరిగి గరిష్ఠ స్థాయికి చేరింది.
హైదరాబాద్‌లో ధరలు ఇలా..
Gold Price in Hyderabad : హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర బుధవారం తొలిసారి రూ.1,26,070కి ఎగబాకింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,750కి చేరింది. మరోవైపు వెండి ధర...                
                
             
								
