TG | స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్…
                    ఎన్నికల నోటిఫికేషన్, జీవో నంబర్ 9పై స్టే విధించిన హైకోర్టు…
TG News | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు (Telangana Local Body Elections) బ్రేక్ పడింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధిస్తూ హైకోర్టు ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. బుధ, గురువారాల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం… స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై స్టే విధించింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందుకు సంబంధించి ప్రభుత్వం నాలుగు వారాల్లో కౌంటర్ ద...                
                
             
								

