Congress | కొండా Vs పొంగులేటి – ఢిల్లీకి చేరిన కాంగ్రెస్ మంత్రుల పంచాయితీ
                    హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో కొద్దిరోజుల క్రితం మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య వివాదం మరువక ముందే.. కాంగ్రెస్ మంత్రుల మధ్య మరో పంచాయితీ మొదలైంది. వరంగల్‌లోని మేడారం జాతర అభివృద్ధి టెండర్ల విషయంలో వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) కి అలాగే ఆ శాఖ మంత్రి అయిన కొండా సురేఖ (Konda Surekha)కు మధ్య విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. మంత్రి పొంగులేటిపై మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వరంగల్ రాజకీయాలతోపాటు దేవాదాయ శాఖలో మంత్రి పొంగులేటి అనవసరంగా జోక్యం చేసుకుంటు న్నారని కొండా దంపతులు ఫిర్యాదులో పేర్కొన్నారు.అయితే ఈ వ్యవహారంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదు చేశారు. పొం...                
                
             
								


