HAM roads | హ్యామ్ రోడ్లకు నేడు టెండర్ నోటిఫికేషన్ విడుదల!
                    Hyderabad : రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్) ప్రాజెక్ట్‌ను అమలు చేస్తూ గ్రామీణ రహదారుల అభివృద్ధికి సిద్దమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని, దాంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు.
మంత్రి సీతక్క ప్రకారం.. హ్యామ్ ప్రాజెక్టుల (HAM roads) కోసం టెండర్ నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేయనున్నారు. మొదటి దశలో 7,449.50 కిలోమీటర్ల పొడవుతో 2,162 రహదారులు నిర్మించనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఇవి మొత్తం 96 నియోజకవర్గాల పరిధిలో 17 ప్యాకేజీల కింద చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ – “హ్యామ్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ గ్రామీణ రహదారులు కొత్త దశలోకి ప్రవేశిస్తాయి. జాతీయ, అంతర్జాతీయ రహదారి సంస్థలు ఈ టెండర్లలో పాల్గొనాలని కోరుతున్నాం” అని తెలిప...                
                
             
								
