Nizamabad | కానిస్టేబుల్ హత్య నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్
                    Nizamabad | తెలంగాణలో సంచలనం సృష్టించినకానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ (Sheikh Riaz) మృతి చెందాడు. ఈ విషయాన్ని వైద్యులు సోమవారం అధికారికంగా ప్రకటించారు. రెండు రోజుల క్రితం నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ (Constable Pramod) పై కత్తితో దారుణంగా దాడిచేసి చేసిన రియాజ్.. అక్కడి నుంచి పారిపోయాడు.ఈ దాడిలో కానిస్టేబుల్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు తీవ్ర స్థాయిలో స్పందించారు. అనంతరం రియాజ్‌ను పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రౌడీ షీటర్ రియాజ్ (Riyaz) ఆదివారం మధ్యాహ్నం సారంగపూర్ అటవీ ప్రాంతంలో పట్టుబడ్డాడు. ఆ సమయంలో పోలీసులను చూసి పారిపోతుండగా రియాజ్‌ను పట్టుకునేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఆ వ్యక్తి రియాజ్ దాడ...                
                
             
								