Student Suicide | పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య కలకలం..
                    Student Suicide in Hanmakonda | హనుమకొండ జిల్లా వంగర ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య (Student Suicide) ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిని వనం వర్షిత శుక్రవారం హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
దీపావళి సెలవుల అనంతరం అక్టోబర్ 23న పాఠశాలకు తిరిగివచ్చిన వర్షిత, మరుసటి రోజు ఉదయం తన యూనిఫాం చున్నీతో ఉరి వేసుకున్నది. విగత జీవిగా ఉన్న వర్షితను గమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న డీఈఓ వాసంతి పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు.
స్నేహితుల ప్రకారం, వర్షిత చదువులో ప్రతిభావంతురాలు. క్లాస్ లీడర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, అందరితో కలిసిమెలిసి ఉండేది. ...                
                
             
								

