KTR | తెలంగాణలో బుల్డోజర్ పాలన రాహుల్ సమాధానం చెప్పాలి..
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: ప్రజలు బీఆర్‌ఎస్ ప్రగతిని గుర్తు చేసుకోవాలి – KTR
Hyderabad | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు బీఆర్‌ఎస్ పదేళ్ల ప్రగతి పాలనను, గత రెండేళ్ల కాంగ్రెస్ మోసపూరిత పాలనను తూకం వేసి సరైన నిర్ణయం తీసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) విజ్ఞప్తి చేశారు. శనివారం షేక్‌పేట్ డివిజన్‌లోని రిలయన్స్ జూబ్లీకేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ పాలన నడుపుతోందని విమర్శించారు. “తెలంగాణలో మైనార్టీ ప్రాతినిధ్యం లేకుండా తొలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆరుగురు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక్క మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వని కాంగ్రెస్‌పై అగ్రనేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి,” అని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, బీజేపీ రెండూ కలిసే పనిచేస్తున్నాయి..
కేటీఆర్ మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి, బీజేపీ నే...
